Cricket News | ఆర్థిక కష్టాల్లో క్రికెటర్ వినోద్ కాంబ్లి
Cricket News | ఆర్థిక కష్టాల్లో క్రికెటర్ వినోద్ కాంబ్లి
సచిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని కాంబ్లి
నా మెడికల్ బిల్లులు ఆయన చెల్లించారు
నాకు క్రికెట్ ఎలా ఆడాలో ఆయన నేర్పారు
Hyderabad : టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సచిన్ టెండుల్కర్ ప్రియమిత్రుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆయన క్రికెట్ అరంగేట్రంలో సచిన్ కంటే బెస్ట్ బ్యాటర్ గా కితాబులందుకున్నాడు కూడా. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ 90వ దశాబ్ధ కాలంలో క్రికెట్ రంగంలో తనదైన ముంద్ర వేసుకున్నారు. డబుల్ సెంచరీల వంటి రికార్డులు నమోదు చేశారు. అయితే అదే ఫామ్ ని కొనసాగించలేకపోయాడు. దీంతో తక్కువ కాలంలోనే జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కాంబ్లీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ విభేదాలపై తాజాగా వినోద్ కాంబ్లీ మనసు విప్పాడు.
2009 సంవత్సరాలో సచిన్ ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే విభేదాలు వచ్చాయని తెలిపాడు.
` సచిన్ తాను తప్పుగా అర్థం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి 2013లో సర్జరీ సమయంలో మెడికల్ బిల్స్ ని అతడే చెల్లించాడు. ఓ దశలో సచిన్ నా కోసం ఏం చేయలేదని అనిపించింది. కానీ సచిన్ నాకోసం ఎన్నో చేశాడు. రెండు సర్జరీలు జరిగినప్పుడు బిల్లు మొత్తం అతడే చెల్లించాడు. తాము మాట్లాడుకున్నాం. తన చిన్ననాటి స్నేహం మళ్లీ మొదలైంది. కెరీర్ ప్రారంభంలో ఎలా ఆడాలో సచిన్ నాకు చెప్పేవాడు. నేను తొమ్మిది సార్లు జట్టులోకి కం బ్యాక్ చేశా. క్రికెటర్లకు గాయాలు తప్పవు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లిన వారే నిలబడతారు. అలాగే టీం నుండి బయటకు వెళ్తూ ఉంటాం. తాను వాంఖడే వేదికగా చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో ఆచ్రేకర్ సర్ నాతో ఉండేవారు. క్రికెట్ లో ముత్తయ్య మురళీధరన్ తో పోటీ పడేవా న్ని ఆయనతో పోటీ సరదాగా ఉండేది. మొత్తానికి నా క్రికెట్ ప్రయాణం సరిగ్గా జరగలేదు. కానీ నాకు సచిన్ వంటి స్నేహితుడు ఎంతో అండగా నిలిచాడు. ఇక నా కుటుంబ మద్దతు చెప్పలేనిది` అంటూ కాంబ్లి చెప్పుకొచ్చాడు.
ఇక వినోద్ కాంబ్లీ తొలిసారిగా భారత జట్టులోకి 1991లో షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్ తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. 1991- 2010 అంతర్జాతీయ క్రికెట్ లో 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. 14 వన్డేల్లో రెండు సెంచరీలతో పాటు.. 14 ఆఫ్ సెంచరీలు చేశాడు. ఇక వినోద్ కాంబ్లీకి అనారోగ్య సమస్యలు ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ ఫెయిల్యూర్, తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్ కి వెళ్ళాడు. 2012లో కంబ్లీ యాంజియోప్లాస్టి చేయించుకున్నాడు.
ఇక 2013లో కాంబ్లీ Vinod Kambli కారు నడుపుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఇక ఇప్పుడు తన పరిస్థితి బాగానే ఉందని చెప్పుకొచ్చాడు కాంబ్లీ. తనని చూసేందుకు అజయ్ జడేజా వచ్చాడని.. దీంతో తనకి చాలా ఆనందంగా ఉందన్నాడు. తన భార్య తన గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని, మూడు ఆసుపత్రిలో చూపించి మరీ వైద్యం చేయించిందన్నాడు. తన కుమారుడు, కుమార్తె సైతం తనకు ఎంతగానో తనకు సాయం గా నిలిచారని తెలిపారు. అయితే తాను ప్రస్తుతం ఎన్నో ఆర్థిక కష్టాలలో ఉన్నట్లు కాంబ్లీ తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు పలు సోషల్, డిజిటల్ మీడియాలో వైరల్గా మారాయి.
* * *
Leave A Comment